![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -355 లో..... ఇన్‌స్పెక్టర్ దీప దగ్గరికి వచ్చి.. తనపై హత్య ప్రయత్నం ఎవరో చేసారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మీకు ఎవరిపై అయినా డౌట్ ఉందా అని ఇన్‌స్పెక్టర్ అడుగగా.. లేదని దీప అంటుంది. జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మాకేం సంబంధం లేదనట్లు మాట్లాడుతన్నారని ఇన్‌స్పెక్టర్ అంటాడు. మిమ్మల్ని పొడిచింది ఆడా, మగ అని ఇన్‌స్పెక్టర్ అడుగగా మగ అని దీప చెప్తుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ వస్తామని చెప్పి ఇన్‌స్పెక్టర్ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత జ్యోత్స్న వాళ్ళింటికి ఇన్‌స్పెక్టర్ ఎందుకు వెళ్ళాడని కార్తీక్ ని దీప అడుగుతుంది. నేనే జరిగిన గొడవ చెప్పి జ్యోత్స్నపై డౌట్ ఉంది అన్నాను అందుకే వెళ్లారని కార్తీక్ అంటాడు.. నిన్ను చంపాల్సిన అవసరం ఇద్దరికి ఉంది. ఒకరు గౌతమ్.. ఇంకొకరు జ్యోత్స్న.. నువ్వు ఇప్పుడు మగ అని చెప్పావ్ కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ గాడే ఈ పని చేసి ఉంటాడు.. వాడిని నా స్టైల్ లో ఎంక్వయిరీ చేస్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీపకి ఇప్పుడు ఎలా ఉందోనని సుమిత్రని దశరథ్ అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకని సుమిత్ర, పారిజాతం అంటారు అప్పుడే దీపని తీసుకొని సుమిత్ర ఇంటికి వస్తాడు కార్తీక్. వాళ్లని చూసి పారిజాతం వాళ్ళు షాక్ అవుతారు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావని దీప అంటున్నా సరే కార్తీక్ లోపలికి తీసుకొని వస్తాడు.
దీపని ఎందుకు తీసుకొని వచ్చావ్ రా అని కార్తీక్ ని అడుగుతుంది సుమిత్ర. మాట్లాడాలి అందరు రావాలి అంటూ తాత అంటూ శివన్నారాయణని పిలుస్తాడు కార్తీక్. అతను వచ్చి ఎందుకు వచ్చావ్ అంటాడు. మీకు అందరికి ఒక విషయం చెప్పాలని వచ్చానని కార్తీక్ అనగానే ఏంటి బావకి నిజం తెలిసిపోయిందా అని జ్యోత్స్న కంగారుపడుతుంది. నా భార్యని కాపాడడానికి ఒక అడుగు ముందుకి వేసావ్ అత్త అని కార్తీక్ థాంక్స్ చెప్తాడు. ఎవరు ఏం చేసినా నా మనవరాలు సాయం చేసిందని శివన్నారాయణ అంటాడు. ఇంకా తెలియాల్సినవి.. రెండు విషయాలు.. ఒకటి బుల్లెట్ ఎవరిది.. రెండు నా భార్య ని పొడిచింది ఎవరో.. అది తెలిసిన రోజు మళ్ళీ వస్తానంటు దీపని తీసుకొని కార్తీక్ బయల్దేర్తాడు. మరొకవైపు జ్యోత్స్నని తీసుకొని పారిజాతం పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |